ముంబయి: అక్టోబర్ 5నుంచి భారత్ వేదికగా జరిగే ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీని విడుదల చేసింది. టీమిండియా అధికారిక కిట్ స్పాన్సర్ అడిడాస్ ప్రత్యేక గీతంతో కూడిన వీడియోను బుధవారం రిలీజ్ చేసింది. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ ప్యాండ్యా, మహ్మద్ సిరాజ్‌తో పాటు పలువురు ఆటగాళ్లు కొత్త జెర్సీలో మెరిశారు. ఈ వీడియోను బిసిసిఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. వాస్తవానికి టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అడిడాస్ వచ్చాక మూడు ఫార్మాట్లలో జెర్సీలను మార్చింది. టి20ల్లో కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్ జెర్సీ, వన్డేల్లో కాలర్‌తో లైట్ బ్లూ కలర్ జెర్సీ, టెస్టుల్లో వైట్ కలర్ జెర్సీలను అడిడాస్ రూపొందించింది. అయితే, జెర్సీలపై కుడివైపు అడిడాస్ లోగోను, ఎడమవైపు బిసిసిఐ టీమ్ లోగోతో పాటు మూడు నక్షత్రాలు, మధ్యలో లీడ్ స్పాన్సర్ డ్రీమ్ 11 పేరు, ఇండియా అని ఉంటుంది. అక్టోబర్ 5న ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి పోరుతో 2023 ఐసిసి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. 14న అహ్మదాబాద్‌లో పాక్‌తో భారత జట్టు తలపడనుంది. ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే.
1983 - the spark. 2011 - the glory.
— BCCI (@BCCI) September 20, 2023
2023 - the dream.
Impossible nahi yeh sapna, #3kaDream hai apna.@adidas pic.twitter.com/PC5cW7YhyQ










