చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పాల్గోనే భారత క్రికెట్ జట్టు హంగ్జూకు బయలుదేరింది. ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నాడు.కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ కొనసాగుతున్నాడు. పురుషుల క్రికెట్ మ్యాచ్‌ల్లో భారత్ ప్రస్థానం అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్నది. క్వార్టర్ ఫైనల్స్ స్టేజ్ నుంచి ఇండియా ఎంట్రీ ఉంటుంది. ఇవాళ సాయంత్రం వరకు ఇండియన్ జట్టు చైనాకు చేరుకోనున్నది. రేపటి నుంచి ఆ జట్టు ప్రాక్టీసు మొదలుపెడుతుంది.
భారత్ జట్టు
రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ముకేశ్ కుమార్, శివం మావి, శివమ్ దూబే, ప్రభుసిమ్రన్ సింగ్(కీపర్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్,, అవేశ్ ఖాన్, అర్షదీప్‌సింగ్.










