న్యూఢిల్లీ : బిజెపి ఎంపీల విషయంలో పార్లమెంటరీ ప్యానెల్స్ అనుసరిస్తున్న తీరును బిఎస్‌పి ఎంపీ దానీశ్ అలీ తప్పుబట్టారు. బిజెపి ఎంపీలు చేసే ఫిర్యాదులు లేదా వారిపై వచ్చే ఫిర్యాదుల విషయంలో ఇవి వివిధ ప్రమాణాలు పాటిస్తున్నాయని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రకు వ్యతిరేకంగా బిజెపి ఎంపీ నిశికాంత్ దూబే చేసిన ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో దనీశ్ అలీ ఉటంకించారు. బిజెపి ఎంపీ రమేశ్ బిధురీ మతపరమైన, అసభ్య పదజాలంతో తనను దూషించటంపై ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుతో పోలిస్తే నిశికాంత్ దూబే ఫిర్యాదును భిన్నంగా చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్యానెల్ ముందుకు తొలుత నిందితుడిని పిలవడానికి ముందు ఫిర్యాదుదారుడిని పిలవాలని పై రెండు ఘటనల గురించి వివరిస్తూ తన అభిప్రాయాన్ని వివరించారు.