Jul 12,2023 21:29

న్యూఢిల్లీ : స్మార్ట్‌ ఫోన్‌ తయారీదారు నథింగ్‌ కంపెనీ కొత్తగా భారత మార్కెట్లోకి నథింగ్‌ ఫోన్‌ 2ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత నథింగ్‌ ఒఎస్‌ 2.0తో తీసుకువచ్చింది. వెనుక వైపు రెండు 50 ఎంపి కెమెరాలు, సెల్ఫీ కోసం 32 ఎంపి కెమెరాలను అమర్చింది. 4,700 ఎంఎహెచ్‌ బ్యాటరీ కలిగిన 8జిబి ర్యామ్‌, 128 జిబి స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ.44,999గా, 12జిబి, 512 జిబి వేరియంట్‌ ధరను రూ.54,999గా నిర్ణయించింది. జులై 21 నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందని నథింగ్‌ కంపెనీ తెలిపింది.