Mar 25,2023 21:30

న్యూఢిల్లీ : లండన్‌ కేంద్రంగా పని చేస్తోన్న సాంకేతిక బ్రాండ్‌ 'నత్తింగ్‌' కొత్తగా ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ ఇయర్‌(2)ను విడుదల చేసింది. అత్యుత్తమ ఆడియో అనుభవాలను అందించేలా వీటిని రూపొందించామని ఆ కంపెనీ తెలిపింది. తమ తొలి ఇయర్‌ (1) ఉత్పత్తులకు విశేష స్పందన లభించిందని పేర్కొంది. ఇయర్‌(2) ఇయర్‌బడ్స్‌లో 11.6 మిల్లీ మీటర్ల కస్టమ్‌ డ్రైవర్‌ లోతైన, అత్యంత శక్తివంతమైన బాస్‌, క్రిస్టల్‌ క్లియర్‌ హైస్‌ ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. భారత్‌లో వీటి ధరలను రూ.9999గా నిర్ణయించింది. మార్చి 28 నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మార్కెట్‌లో ఇవి లభ్యమవుతాయని వెల్లడించింది.