Mar 20,2023 07:31

ఒరేయ్ అబ్బాయి
మాకు పెద్ద పట్టింపులు ఏమీ లేవు
సిద్ధాంతం రాద్ధాంతం అసలే లేవు
పెద్దగా బాధపడేది లేదు !

ఒకరికి అధికారం కావాలి
మరొకరికి పదవి కావాలి
మనందరికీ డబ్బు కావాలి
ఇప్పుడు
ఎలుకను రక్షించమని
మనందరమూ పిల్లిని వేడుకోవాలి

కొందరం సంతోషపడాలి
గంపగుత్తగా మనందరం
గొర్రెలము కానందుకు ...!
 

(ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూసి ...)
- డా. ఎడ్ల కల్లేశ్‌
9866765126