గత కొన్నిరోజులుగా వీపునొప్పితో బాధపడుతున్న బుమ్రాకు వైద్య పరీక్షలు నిర్వహించగా, గాయం తీవ్రమైనదేనని వెల్లడింది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు దూరమైన బుమ్రా. గాయం తీవ్రత దష్ట్యా టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. దీనిపై బుమ్రా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో తాను ఆడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని తెలిపాడు. ఈ సమయంలో మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించాడు. తాను కోలుకుంటున్నానని, టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని బుమ్రా వివరించాడు.










