Jun 16,2023 07:50

వేసవి కాలంలో చల్లదనం కోసం కూలర్లను చాలామంది ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని సరైన పద్ధతిలో ఉపయోగించుకోకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కూలర్లలోని నీరు వాసన రాకుండా చూసుకోవాలి.

బయట దుమ్ము, తేమ కారణంగా కూలర్‌ వాసన రావటం మొదలవుతుంది. నీరు నిల్వ ఉన్నా చెడు వాసన వస్తుంది. ఒక్కోసారి కూలర్‌లోని గడ్డి, కూలింగ్‌ ప్యాడ్‌లోని అచ్చు నుంచి కూడా దుర్వాసన వస్తుంది. ఏం చేయాలి ?
వారానికోసారైనా కూలర్లో నీటిని పూర్తిగా తీసేసి శుభ్రం చేయాలి. వేప ఆకులను ఓ కాటన్‌ గుడ్డలో కట్టాలి. ఈ వస్త్రం చాలా పలుచగా ఉండాలి. ఇలా తయారు చేసిన వేప ఆకుల మూటను కూలర్‌ నీటిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల నీరు వాసన పట్టదు. క్రిమికీటకాలు కూడా వృద్ధి చెందవు. ప్రతి 3-4 రోజులకు ఒకసారి వేప ఆకులను మార్చాలి.

  • నారింజ తొక్కను ఎండబెట్టి పౌడర్‌ చేసుకోవాలి. దీనికి కాస్త దాల్చిన చెక్కను కూడా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూలర్‌ నీటిలో కొద్ది మొత్తంలో చల్లుకోవాలి.
  • నీటిలో 1 టీస్పూన్‌ బేకింగ్‌ సోడాను చల్లాలి. ఇలా ప్రతి రోజూ కూలర్‌లో నీటిని నింపిన వెంటనే వంట సోడా చల్లుతుంటే నీళ్లు వాసన రావు.