ప్రతి ఒక్కరూ వంటగదిని శుభ్రంగా ఉంచడానికే ప్రయత్నిస్తారు. అయితే చాలామంది కిచెన్ సింక్‌లో అనేక రకాల పాత్రలు, పదార్థాలను రాత్రంతా అలాగే ఉంచేస్తారు. దీనివల్ల సింక్ నుంచి ఒకరకమైన వాసన వస్తుంది. ఆయా పదార్థాల్లో ఉండే బ్యాక్టీరియా అంతా సింక్‌లో పేరుకుపోవడమే ఈ దుర్వాసనకు కారణం. వాసన పోయేందుకు చాలామంది అనేక రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే ఇది ఆరోగ్యాన్ని చేటు చేస్తుంది. దానికి బదులుగా సహజ ఉపత్పత్తులతోనే సింక్‌ను శుభ్రం చేసుకోవొచ్చు.
వేడి నీరు, బ్లీచ్
వేడి నీటిలో కొంచెం బ్లీచింగ్ పౌడర్ వేసి ఆ నీటితో సింక్ శుభ్రం చేసుకోవచ్చు.
వెనిగర్, నిమ్మకాయ
నిమ్మరసం, వెనిగర్ మిశ్రమాన్ని సింక్‌లో పోసి, అరగంట అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీళ్ళతో శుభ్రం చేయాలి.
వంట సోడా
సింక్ బ్లాక్ అయితే వంట సోడాను వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కడిగేస్తే సింక్ రంధ్రాలు శుభ్రపడతాయి.
వేప ఆకు
కొన్ని వేప ఆకులను నీటిలో వేసి మరిగించి ఈ నీటిని సింక్‌లో వేయాలి. కొంత సేపటి తర్వాత సబ్బు నీటిని ఉపయోగించి సింక్‌ను స్క్రబ్ చేస్తే, సింక్ శుభ్రపడుతుంది.










