సిగ్గు లేదు.. శరం లేదు
నోటిలోని మాట తప్ప
నిలదీసే దమ్ములేదు !
భయం మాటున దాగిన
బడా చోర్ల బాగోతం బయటపడింది
నోటికి తాళం వేసి గాంభీర్యం గర్జన
దగా పడ్డ తెలుగు తల్లి బిడ్డలారా
తెగువ చూపి కదలండి బిర బిర
వడి వడిగా అడుగులేసి కదలండి
నీ సత్తువ.. నీ తెగువ.. నీ ధైర్యం
నెత్తురు మండే సూరీడల్లే తెగ పడు
ఎగసిపడే సముద్రమల్లే తిరగబడు
నీ తోడుగా నీకండగ నీ వెంటే..
నీతోనే ఉందొరు ..ఎర్రని జెండా
భయం వద్దు.. బెరుకు వద్దు
పద పద పద పద నిలదీద్దాం
నీ ఓటుతో గద్దెనెక్కిన నేతలను
నిగ్గదీసి అడుగుదాం పద పద పద
మేమున్నాం... మేమున్నాం.. నీ వెంటే
మేమున్నాం.. పాలకుల పని పట్టగ
పద పద పద పద జర జర జరనడు!
- రెడ్డి శంకరరావు
94943 33511










