కొత్త పుస్తకం వాసన వస్తుంది
బుడత తల్లికి బువ్వ లాగా
చిట్టి చేతులతో స్పర్శిస్తుంటే
మట్టి వాసనే కమ్ముకుంది మనసులో...
తెలుగు వాచకం ఆకర్షించే
అమ్మ పలుకులందులో వినిపించే
అందమైన బొమ్మలు చూసి
చిన్నారి కళ్ళు మిరిమిట్లు గొలిపే...
పుస్తకం నిండా రంగుల చిత్రాలే
ముఖచిత్రమే మురిపెము గొలిపే
వర్ణమాలే ఆకాశపు నక్షత్రములాగా
నిర్మలమైన మనసులు సుస్థిరం పొందే....
అమ్మ పదమే అమృతమై
ఆవు పాల లాగా బలమును చేకూర్చే
అచ్చులై ఆయువు పోస్తూ
హల్లులో ఆనందం పంచుతూ
ఉభయాక్షరాలతో కలిసి తిరుగుతూ
ఓనమాలు జ్ఞానదారి చూపించే..
గుణింతాలు గుణాలు నేర్పించే
ఒత్తులు జీవితానికి అర్థం వివరించే
వ్యాకరణం వికారాన్ని తొలగించే
తెలుగు పదాలే మాధుర్యం కురిపించే...
బాల్యపు భవిత చందనమై వ్యాపించే
చేతిలో పుస్తకం చిరుగాలై పలకరిస్తే
చిన్న మనసులో జ్ఞానపు వాసన పులకించే..
- కొప్పుల ప్రసాద్
98850 66235










