Sep 26,2023 21:31
  • రెండో వన్డేలోనూ బంగ్లాపై గెలుపు

ఢాకా: బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్‌ జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. మంగళవారం జరిగిన మూడో, చివరి వన్డేలో న్యూజిలాండ్‌ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ జట్టు 34.3ఓవర్లలో 171పరుగులకు కుప్పకూలింది. మిల్నేకు నాలుగు, కోంచీ, బౌల్ట్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ జట్టు 34.5ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి ఛేదించింది. యంగ్‌(70), నికోల్స్‌(50నాటౌట్‌), బ్లండెల్‌(23నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. ఇస్లామ్‌కు రెండు వికెట్లు దక్కాయి. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్‌ జట్టు 80పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ యంగ్‌, సిరీస్‌ నికోల్స్‌కు లభించాయి.