Sep 28,2023 12:02

హైదరాబాద్‌: న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బేగంపేటలోని ఐటిసి కాకతీయకు చేరుకున్న న్యూజిలాండ్‌ జట్టు ఈ రోజు రాత్రి అక్కడే బస చేయనుంది. ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్ల నిర్వహణ కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పాకిస్తాన్‌ జట్టు హైదరాబాద్‌ చేరుకోగా ఈ రెండు జట్లు రేపు మొదటి వార్మప్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి.