Oct 05,2023 21:48
  • ఇంగ్లండ్‌పై 9వికెట్ల తేడాతో నెగ్గిన బ్లాక్‌ క్యాప్స్‌
  •  కాన్వే, రవీంద్ర సెంచరీలు

అహ్మదాబాద్‌: వన్డే ప్రపంచకప్‌ న్యూజిలాండ్‌ జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టు నిర్దేశించిన 283పరుగుల లక్ష్యాన్ని యంగ్‌(0) వికెట్‌ కోల్పోయి ఛేదించింది. కాన్వే(152నాటౌట్‌; 121బంతుల్లో 19ఫోర్లు, 3సిక్సర్లు), రచిన్‌ రవీంద్ర(123నాటౌట్‌; 96బంతుల్లో 11ఫోర్లు, 5సిక్సర్లు) ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. న్యూజిలాండ్‌ 25 ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్‌ కోల్పోయి 187పరుగులు చేసింది. ఆ తర్వాత కాన్వే, రవీంద్ర అజేయ శతకాలతో కదం తొక్కడంతో న్యూజిలాండ్‌ జట్టు 36.2ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో జో రూట్‌ (77; 86బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్‌) అర్ధ శతకం బాదాడు. జోస్‌ బట్లర్‌ (43; 42బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్సర్లు) రాణించాడు. హెన్రీకి మూడు, సాంట్నర్‌, ఫిలిప్స్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.

2


స్కోర్‌బోర్డు..
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: బెయిర్‌స్టో (సి)మిఛెల్‌ (బి)సాంట్నర్‌ 33, మలన్‌ (సి)లాథమ్‌ (బి)హెన్రీ 14, రూట్‌ (బి)ఫిలిప్స్‌ 77, బ్రూక్‌ (సి)కాన్వే (బి)రవీంద్ర 25, మొయిన్‌ (బి)ఫిలిప్స్‌ 11, బట్లర్‌ (సి)లాథమ్‌ (బి)హెన్రీ 43, లివింగ్‌స్టోన్‌ (సి)హెన్రీ (బి)బౌల్ట్‌ 20, శామ్‌ కర్రన్‌ (సి)లాథమ్‌ (బి)హెన్రీ 14, వోక్స్‌ (సి)యంగ్‌ (బి)సాంట్నర్‌ 11, ఆదిల్‌ రషీద్‌ (నాటౌట్‌) 15, మార్క్‌ వుడ్‌ (నాటౌట్‌) 13, అదనం 6. (50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 282పరుగులు.
వికెట్ల పతనం: 1/40, 2/64, 3/94, 4/118, 5/188, 6/221, 7/229, 8/250, 9/252
బౌలింగ్‌: బౌల్ట్‌ 10-1-48-1, హెన్రీ 10-1-48-3, సాంట్నర్‌ 10-0-37-2, నీషమ్‌ 7-0-56-0, రవీంద్ర 10-0-76-1, ఫిలిప్స్‌ 3-0-17-2.
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (నాటౌట్‌) 152, యంగ్‌ (సి)బట్లర్‌ (బి)శామ్‌ కర్రన్‌ 0, రవీంద్ర (నాటౌట్‌) 123, అదనం 8, (36.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 283పరుగులు.
వికెట్ల పతనం: 1/10
బౌలింగ్‌: వోక్స్‌ 6-0-45-0, శామ్‌ కర్రన్‌ 6-2-47-1, వుడ్‌ 5-0-55-0, మొయిన్‌ 9.2-0-50-0, ఆదిల్‌ రషీద్‌ 7-0-47-0, లివింగ్‌స్టోన్‌ 3-0-24-0

వన్డే ప్రపంచకప్‌లో నేడు..
పాకిస్తాన్‌ × నెదర్లాండ్స్‌
వేదిక: హైదరాబాద్‌; మ.2.00గం||లకు)