Oct 09,2023 18:17

హైదరాబాద్‌: వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా ఇవాళ న్యూజిలాండ్‌-నెదర్లాండ్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కివీస్‌.. 50 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి.. నెదర్లాండ్స్‌ లక్ష్యం 323 పరుగులుగా నిర్దేశించింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో విల్‌ యంగ్‌ 70, టామ్‌ లాథమ్‌ 53, రచిన్‌ రవీంద్ర 51, డారిల్‌ మిచెల్‌ 48, రాణించాగా.. డెవన్‌ కాన్వే 32, మిచెల్‌ సాంట్నర్‌ 36 పర్వలేదనిపించారు. చివరల్లోమ్యాట్‌ హెన్రీ 10, గ్లెన్‌ ఫిలిప్స్‌ 4, మార్క్‌ చాప్‌మన్‌ 5 పరుగులు మాత్రమే చేశారు. నెదర్లాండ్స్‌ బౌలింగ్‌లో ఆర్యన్‌ దత్‌, పాల్‌ వాన్‌ మీకెరెన్‌, రోల్ఫ్‌ వాన్‌ డెర్‌ మెర్వ్‌ తలో 2 వికెట్లు తీసుకోగా, బాస్‌ డి లీడ్‌ 1 వికెట్‌ తీశాడు.