
- మిచెల్ శాంట్నర్ కు 5 వికెట్లు
- తొలుత 50 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగులు చేసిన న్యూజిలాండ్
- 46.3 ఓవర్లలో 223 పరుగులకు నెదర్లాండ్స్ ఆలౌట్
ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లోనూ 99 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్ జట్టు 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 5 వికెట్లతో డచ్ జట్టు వెన్నువిరిచాడు. వరల్డ్ కప్ చరిత్రలో ఐదు వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్‌గా శాంట్నర్ ఘనత సాధించాడు. మాట్ హెన్రీ 3, రచిన్ రవీంద్ర 1 వికెట్ తీశారు. నెదర్లాండ్స్ జట్టులో కోలిన్ అకెర్ మన్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 30, సైబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్ట్ 29, తేజ నిడమనూరు 21 పరుగులు సాధించారు.