Sep 26,2023 21:02

పూణె : విద్యుత్‌ ఉపకరణాల సంస్థ కిర్లోస్కర్‌ ఆయిల్‌ ఇంజిన్స్‌ (కెఒఇఎల్‌) కొత్తగా సిపిసిబి4 ప్రమాణాలతో కూడిన జెన్‌సెట్‌లను విడుదల చేసినట్లు ప్రకటించింది. వీటితో స్థిరమైన విద్యుత్‌ ఉత్పత్తి, పర్యావరణ నిర్వహణ నిబద్దతను ప్రదర్శిస్తాయని పేర్కొంది. ఇవి డీజిల్‌, సహజ వాయువు, బయోగ్యాస్‌ తదితర బహుళ ఇంధనాలతో పని చేసేలా రూపొందించబడ్డాయని ఆ సంస్థ ఎండి గౌరీ కిర్లోస్కర్‌ పేర్కొన్నారు. ఇవి ఐఒటి ఆధారంగా పని చేస్తాయన్నారు.