న్యూఢిల్లీ: గృహోపకరణాలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ హయ్యర్ కొత్తగా కినౌచి 5స్టార్ హెవీ డ్యూటీ ప్రో ఎయిర్ కండీషనర్ సిరీస్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఈ సీరిస్ ఎసిలు సూపర్ కూలింగ్ ఫీచర్‌తో శక్తిమంతమైన పనితీరును అందిస్తాయని పేర్కొంది. ఇవి 65 శాతం శక్తిని పొదుపు చేస్తాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకాల్లో రెండంకెల వృద్థిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. హయర్ రూ.14990 విలువైన 5 సంవత్సరాల వారంటీ, రూ.4000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, రూ.1500 విలువైన ఉచిత ఇన్‌స్టాలేషన్, జీవితకాల కంప్రెసర్ వారంటీ ఉందని పేర్కొంది. హయర్ కినౌచి హెవీ డ్యూటీ ప్రో 5 స్టార్ ఎయిర్ కండీషనర్ ప్రారంభ ధరను రూ.47,990గా నిర్ణయించినట్లు వెల్లడించింది.










