Oct 28,2023 22:20

87పరుగుల తేడాతో నెగ్గిన డచ్‌ జట్టు
కోల్‌కతా: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌ మరో సంచలనానికి తెరలేపింది. శుక్రవారం ఈడెన్‌గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ జట్టు 87పరుగుల తేడాతో నెగ్గి రెండో సంచలనం సృష్టించింది. తొలుత దక్షిణాఫ్రికాపై 38పరుగుల తేడాతో నెగ్గి డచ్‌ జట్టు తొలి సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఇక బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 229పరుగులకు ఆలౌటైంది. ఎడ్వర్డ్స్‌(68), బర్రెసి(41) బ్యాటింగ్‌లో రాణించారు. షోరిఫుల్‌, తస్కిన్‌, ముస్తాఫిజుర్‌, మెహిదీ హసన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా జట్టు 42.2ఓవర్లలో 142పరుగులకే కుప్పకూలింది. మెహిదీ హసన్‌(35), మహ్మదుల్లా(20), ముస్తాఫిజుర్‌(20) పరుగులతో రాణించారు. నెదర్లాండ్స్‌ బౌలర్లు మీకెరన్‌కు నాలుగు, లీడేకు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మీకెరన్‌కు లభించింది.