
దుబాయ్ : వెస్టిండీస్ వేదికగా 2024 జరిగే టి20 ప్రపంచకప్‌కు ఆసియా ఖండ జట్లయిన నేపాల్, ఓమన్ అర్హత సాధించాయి. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నేపాల్ జట్టు యుఏఇపై, ఓమన్ జట్టు బహ్రైయిన్‌పై గెలిచి గ్రూప్ టాపర్స్‌గా నిలిచాయి. నేపాల్ జట్టు యుఏఇ నిర్దేశించిన 134పరుగుల లక్ష్యాన్ని కేవలం 2వికెట్లు కోల్పోయి ఛేదించి టాప్-2లో నిలిచింది. ఇక ఓమన్ జట్టు అర్హత టోర్నీలో అప్రతిహాత విజయాలతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా బహ్రైయిన్ జట్టు 20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 106పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని ఓమన్ జట్టు 6ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓమన్ ఓపెనర్లు కశ్యప్ ప్రజాపతి, ప్రతిక్ అథర్వెలే వికెట్ పడకుండా 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకున్నారు.