
ప్రజాశక్తి-కలకడ(అన్నమయ్య) : రోగులపట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని ఎంపీపీ శ్రీదేవి రవి కుమార్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీలు నిర్వహించారు. వైద్యశాలలో రికార్డులు పరిశీలించి సిబ్బంది హాజరును తనిఖీలు చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ కండెక్ట్ చేసి హాస్పిటల్లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కొత్తగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఎమర్జెన్సీ మెడిసిన్స్ ని అందుబాటులో ఉంచాలని, హాస్పిటల్ ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే వచ్చిన రోగులతో పొలైట్‌గా మాట్లాడాలని ఆదేశించారు. హాస్పిటల్‌లో గల లాబ్, ఫార్మసీ గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ కిషోర్ కుమార్ రెడ్డి, కలకడ మెడికల్ ఆఫీసర్ మల్లికార్జున రావు, జోవహార్ బాబు, సుబ్బరత్న ,పీహెచ్‌ఎన్ రెడ్డమ్మ . వెంకటేశ్వరరావు , ఇస్మాయిల్ ,కంప్యూటర్స్ నవీన్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ భారతమ్మ , జయరామయ్య, అలివేలు , ఈశ్వరయ్య , మొదలగువారు పేర్కొన్నట్టు తెలిపారు,