
ప్రజాశక్తి - ఆలమూరు(కోనసీమ) : మండలంలోని పెదపళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శనివారం ఓ గప్తదాత రూ.లక్షా 5 వేలు విలువ చేసే ఈసీజీని మిషన్‌ను బహూకరించారు. స్థానిక పిహెచ్చిలో ఈ మిషన్ లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం చెందిన దాతతో పెదపళ్ల మాజీ సర్పంచ్, పిహెచ్సి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ గారపాటి త్రిమూర్తులు దాతను సంప్రదించి ఈసీజీని అందించాలని సూచించారు. ఈ మేరకు గారపాటి త్రిమూర్తులు చేతుల మీదుగా పిహెచ్సి వైద్యాధికారి పి.భవాని శంకర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏడిద సత్యశ్రీ, ఎంపీటీసీ నెక్కంటి ప్రమీల, వైసీపీ నేతలు మెహర్ ప్రసాద్, సూర్య ప్రకాష్ రావు, అల్లూరి సత్యనారాయణ, నడిపిల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.