
ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : గంబూషియ చేపలతో దోమల లార్వా నివారణకు చర్యలు చేపట్టినట్లు ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, పీహెచ్సీ వైద్య అధికారి డాక్టర్ ఎం.సుమలత అన్నారు. మండలంలోని చొప్పెల్లలో నీటి నిల్వలు ఉన్న ప్రదేశాలను గుర్తించి అధికారి ఆధ్వర్యంలో గంబూషియ చేపలను శనివారం నీటి నిల్వ ప్రదేశాలలో విడుదల చేశారు. ఇందులో ముఖ్యంగా పాము గొయ్యి, సాయిబాబా గుడి వెనుక గొయ్యి, గురువుగొయ్యి, తదితర ముఖ్య ప్రదేశాలను ఎంపిక చేసి దోమల లార్వా గుడ్ల నివారణకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్బంగా అధికారి మాట్లాడుతూ ... ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంతోపాటు మూలస్థానం, మడికి, తదితర గ్రామాల్లో కూడా చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దంగేటి చంద్రకళ బాపనయ్య, ఉప సర్పంచ్ సుంకర కామరాజు , నేతలు జిలగం వెంకన్న, జాంపోలు అబ్బులు, కార్యదర్శి ఎం.శ్యామ్ సుందరం, పీహెచ్సీ సూపర్వైజర్లు వెంకటేశ్వరరావు, సిహెచ్ బేబీ, కె.ప్రసాద్, ఎస్.ఎస్.వి.ప్రసాద్, ఇమాన్యుల్, ఏఎన్‌ఎంలు ఆశా వర్కర్లు గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.