Oct 08,2023 11:58

ప్రజాశక్తి - చాపాడు (కడప) : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని నంద్యాల రోడ్డులో ఉన్న విఆర్‌ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఎస్‌ఎల్‌ఆర్‌ హాస్పిటల్‌ వైద్యులు రామ అనిల్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినది. వందలాదిమంది వైద్య శిబిరానికి వచ్చి వివిధ రకాల పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందారు. ఈ సందర్భంగా వైద్యులు రామ అనిల్‌ కుమార్‌ రెడ్డి కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ... ఎస్‌ఎల్‌ ఆర్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ప్రతివారం మైదుకూరు నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రక్త పరీక్షలతో పాటు ఈసిజి తదితర పరీక్షలను ఉచితంగా చేయిస్తున్నామన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి కళాశాల కరస్పాండెంట్‌ ఎస్‌.వెంకట రాముడు, ప్రముఖ న్యాయవాది కే.శ్రీనివాసులు, కళాశాల ప్రిన్సిపల్‌ బి.తిరుమలేష్‌, సామాజిక కార్యకర్త చెన్నకేశవ, రాము సహకరించారు. ఈ కార్యక్రమంలో కర్నూల్‌ మెడికేర్‌ సిబ్బందితోపాటు ఎస్‌ ఎల్‌ ఆర్‌ హాస్పిటల్‌ సిబ్బంది పాల్గొన్నారు.