
ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ఆదోనిలో శనివారం కాపు తెగ బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కరణం రంగస్వామి, చందం మల్లికార్జున శుక్రవారం విలేకరులకు తెలిపారు. బిపీ, షుగర్, ఈసీజీ, 2డి ఈసీఓ పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి నంద్యాలలోని ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తారని తెలిపారు. 9963901595, 7013474059కు సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.