ప్రజాశక్తి-రాంబిల్లి (అనకాపల్లి) : ఎనిమిది గ్రామాలకు చెందిన నేవీ నిర్వా సితులు వాడనర్సాపురం సమీపంలో ఎన్‌ఏవోబీ గేటు ముందు చేస్తున్న ఆందోళన మంగళవారం నాటికి 58వ రోజుకు చేరుకుంది. గతంలో అధికారులు ఇచ్చిన హామీలను , తమతో చేసుకున్న ఒప్పందాలను అమలుచేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. సుమారు రెండు నెలల నుంచి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నప్పటికీ పాలకులు, అధికారులు స్పందించకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించాలని లేకుంటే పెద్ద ఎత్తున్న నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు.










