ప్రజాశక్తి - రాంబిల్లి (అనకాపల్లి) : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేవల్ బేస్ నిర్వాసితులు చేస్తున్న ఆందోళన 39వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నేవీ మెయిన్ గేట్ ముందు రోడ్డుపై బైఠాయించి వేలాదిమంది నిర్వాసితులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దేవుడు నాయుడు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 39 రోజులుగా వేలాదిమంది నిర్వాసితులు రోడ్డుపై ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఎటువంటి చలనం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులు గోస విని వారు న్యాయమైన సమస్యలను, ఇప్పటికైనా నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిమంది నిర్వాసితులు 8 గ్రామాలు జేఏసీ కమిటీ పెద్దలు పాల్గొన్నారు.










