Oct 10,2023 11:39

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో సినీనటుడు నవదీప్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ అతన్ను ప్రశ్నించనుంది. గుడిమల్కాపూర్‌ ఠాణా పరిధిలో ఇటీవల నమోదైన మాదకద్రవ్యాల కేసులో బహిర్గతమైన అంశాల ఆధారంగా ఈనెల 10న విచారణకు హాజరు కావాలని నవదీప్‌కు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. పోలీసులకు చిక్కిన నైజీరియన్‌ డ్రగ్‌పెడ్లర్‌తో పాటు తెలుగు సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి, రాంచందర్‌లను విచారించడంతో నవదీప్‌ పేరు బయటికివచ్చింది. ఈ క్రమంలోనే నవదీప్‌ను కొద్దిరోజుల క్రితం టీన్యాబ్‌ పోలీసులు సుమారు ఆరు గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే.