Nov 11,2023 15:41

హైదరాబాద్‌: అఫ్జల్‌ గంజ్‌ పోలీసులు టీఎస్‌ న్యాబ్‌ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి అంతర్‌ రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేశామని హైదరాబద్‌ సీపీ సందీప్‌ సాండిల్య తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 1464 నైట్రావెట్‌ మాత్రలు (సైకోట్రోపిక్‌ డ్రగ్‌), రెండు మొబైల్‌ ఫోన్‌లు సీజ్‌ చేశాం.. ప్రధాన నిందితుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బిర్జు ఉపాధ్యాయ పై బీదర్లో రౌడీ షీట్‌ ఉంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన బిర్జు ఉపాధ్యారు తో పాటు కుటుంబం గత 14 ఏళ్లుగా హైదరాబాద్‌ లో ఉంటూ నైట్రావెట్‌ మాత్రలు విక్రయిస్తుంది.. మరో నిందితుడు కిషన్‌ విట్టల్‌ రావు కాంబ్లే బిర్జు ఉపాధ్యారు కు అసోసియేట్‌ గా వ్యవహరిస్తాడు అని సీపీ తెలిపారు.
గుల్బర్గాకు చెందిన సుప్రీత్‌ నవలే అనే వ్యక్తి నుండి బిర్జు ఉపాధ్యారు మాత్రలు కొనుగోలు చేస్తాడు అని సీపీ సాండిల్య పేర్కొన్నారు. ఒక్కో నైట్రావెట్‌ మాత్రల బాక్స్‌ ను రెండు వేల రూపాయల చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని డ్రగ్‌ పెడ్లర్లకు రూ. 5,500 అక్రమంగా విక్రయించారు.. బిర్జు ఉపాధ్యారు తన భార్య కుమారుడు అత్త సహకారంతో కర్ణాటక నుండి హైదరాబాద్‌ కి డ్రగ్‌ సరఫరా చేసేవాడు అని ఆయన చెప్పుకొచ్చారు. బిర్జు తన బంధువు రాను భాయి అనే వ్యక్తికి టాబ్లెట్స్‌ ఇచ్చి కర్ణాటక నుండి హైదరాబాద్‌ పంపాడు అని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాండిల్య చెప్పారు.
ఈ టాబ్లెట్స్‌ ను మాంగర్‌ బస్తీలో నివాసం ఉంటున్న రాజు, పల్లవి అనే తన బంధువులకు సరఫరా చేయాల్సి ఉంది.. ఈ క్రమంలో నిందితుడు రాను భాయి కర్ణాటక నుండి నైట్రావెట్‌ ట్యాబ్లెట్‌లను తీసుకుని ఎమ్‌జిబిఎస్‌లో బస్సు దిగాడు అని సందీప్‌ సాండిల్య తెలిపారు. నైట్రావెట్‌ మాత్రలను మాంగేర్‌ బస్తీలోని హబీబ్‌నగర్‌ ను తీసుకు వెళ్తూ ఉండగా టీఎస్‌న్యాబ్‌, అఫ్జల్‌గంజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఆపై మంగర్బస్తీలోని నిందితుల ఇంటిపై దాడి చేసారు.. నిందితుల నివాసంలో 11 బాక్స్‌ల నైట్రావెట్‌ టాబ్లెట్‌లు 22 ఎస్కుఫ్‌ సిరప్‌ లను సీజ్‌ చేసాం.. బంగారు బస్తిలోని బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు బీదర్‌ లోని బిరుసు ఫ్యామిలీ పట్టుకునేందుకు హెచ్‌న్యూకి చెందిన ఐదుగురు పోలీసు సిబ్బంది వెళ్ళారు.. నిందితులు ఇంటిపై ఈ నెల నాలుగో తేదీన తెల్లవారుజామున 1 గంటలకు రైడ్‌ చేశారు.. ఉమ్మడి కుటుంబం కావడంతో ఒక్కసారిగా కుటుంబం అంతా కలిసి మా పోలీసులపై దాడి చేశారు అని హైదరాబాద్‌ సీపీ సందీప్‌ సాండిల్య వెల్లడించారు.