Oct 08,2023 12:38

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. తాజాగా.. మరో ఇద్దరిని గ్రేటర్‌ హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో నగరానికి 30 గ్రాముల కొకైన్‌ తీసుకొచ్చి విక్రయిస్తుండగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను డ్రగ్స్‌ వ్యాపారిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీకెండ్‌ కావడంతో పబ్‌లలో, శివారు ప్రాంతాల్లోని ఫాంహౌజ్‌లలో డ్రగ్స్‌ పార్టీల కోసం డ్రగ్స్‌ విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గోవా నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్న ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.