
మహారాష్ట్ర: మహారాష్ట్రలో డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకొన్నారు. ఛత్రపతి శంభాజీనగర్‌లో 23 కేజీల కొకైన్, 2.9 కేజీల మెఫెడ్రోన్‌తో పాటు ఒక నిందితుడి ఇంటి నుంచి 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల తయారీకి ఉపయోగించే 704 కిలోల మెఫెడ్రోన్‌ను సీజ్ చేశారు. మార్కెట్లో దీని విలువ 1400 కోట్లు పైబడి ఉంటుందని అంచనా వేశారు. ఔషధాల ముసుగులో మాదక ద్రవ్యాలు తయారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దేశ ఆర్ధిక రాజధాని ముంబయి వెలుగులోకి వచ్చిన ఘటన సంచలనం సృష్టించింది.