Jul 12,2023 08:49

బాలల్లారా ! రారండి !
సూర్యచంద్రుల కథ వినరండి
సూర్యుడు పెద్ద నక్షత్రం
చంద్రుడు భూమికి ఉపగ్రహం

ఆకాశంలో సూర్య చంద్రులు
మానవాళికి మంచి మిత్రులు
విశ్రమించక పరిశ్రమించే
ప్రకృతి వింతలు ఆ రెండు

పగటి వేళలో వెలుగును ఇస్తూ
పంట పొలాలకు ఆహారాన్నిస్తూ
ఎండ వేడిమిని భూమికి ఇస్తూ
సూక్ష్మ క్రిములను చంపును సూర్యుడు

హాయిని గొలిపే వెన్నెలనిస్తూ
చల్లని చూపులు భూమిపై నిలిపి
ఎల్ల ప్రాణులకు సుఖాన్నిస్తూ
రాత్రివేళలో ఆదుకొనును చంద్రుడు
వారు లేనిదే భూమే లేదు.. జగతే లేదు
అందుకే కొలిచెను జనులంతా
 

- డాక్టర్‌ దార్ల బుజ్జిబాబు