ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : రామచంద్రపురంలో గల రాజరత్న కిట్స్ కళాశాలలో ఈనెల 23 నుండి జాతీయ సైన్స్-ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ మోడల్స్ ఎగ్జిబిషన్ జరుగనుందనీ డైరెక్టర్ పవన్, ప్రిన్సిపల్ రవిధర్‌లు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. కోనసీమ ప్రాంతంలో రీసెర్చ్ నాగరికత పెంపోందింప చేయడానికి, రాజారత్న ట్రస్ట్ ఈ బృహత్ పధకానికి శ్రీకారం చుట్టారనీ వారు వివరించారు. వివిధ సంస్థల నుండి వచ్చిన మోడల్స్ ను ఇందులో ప్రదర్శించ నున్నారు. అన్ని కళాశాలల నుండి సందర్శకులను ఆహ్వానించారు. ముఖ్యఅతిథిగా,రిలయన్స్ కాకినాడ అధినేత, టి. విశ్వనాధ్ విచేయనున్నారన్నారు. రాజ రత్న ట్రస్ట్ ఈ ప్రదర్శనలో అద్భుతంగా వున్న వాటికి పెద్ద ఎత్తున బహుమతులు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. కోనసీమ విద్యార్థులకు, స్ఫూర్తి దాయకంగా వున్న ప్రాజెక్ట్‌లను, న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారని ఐఐఐటి నూజివీడు, ఎన్‌జిఅర్‌ఐ హైదరాబాద్, గిన్నిస్ రికార్డు విజేతలు, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు, ఇంజనీరింగ్ నిపుణులు, వచ్చి మోడల్స్‌ను పరిశీలించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు వ్యవసాయానికి అవసరమైన కొత్త రకాల పరికరాలను రూపొందించమని వాటి ద్వారా తక్కువ వ్యయంతో రైతన్నలు ఎక్కువ ఆదాయం పొందే వీలుందని తెలియజేశారు. ఈనెల 23 24 తేదీల్లో జరిగే ఎగ్జిబిషన్లో వీటిని ప్రదర్శిస్తామని కళాశాల విద్యార్థులు విలేకరులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసక్తి గల అభ్యర్థులు పాల్గొని తగు సందేశాలు ఇవ్వాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.










