Jan 24,2023 13:04

ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్‌ కోనసీమ) : జాతీయ బాలిక దినోత్సవమును పురస్కరించుకొని మండలంలోని బడుగువానిలంకలో విద్యార్థులతో ' భేటీ బచావో భేటి పడావో బాలికలను కాపాడుకుందాం బాలికలను చదవనిద్దాం ' అనే నినాదంతో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ' ఆడపిల్లను పుట్టనిద్దాం.. బ్రతకనిద్దాం.. చదవనిద్దాం.. ఎదగనిద్దాం.. ఆడపిల్ల దేశానికి గర్వకారణం , ఆడపిల్ల అంటే మరో అమ్మ, ఆడ పిల్లలను రక్షించుకుందాం ఆడపిల్లలను కాపాడుకుందాం..' అనే పలు నినాదాలతో ఘనంగా ర్యాలీ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ దూలం వెంకటలక్ష్మి సత్తిబాబు, వైసిపి నేతలు కటారి గంగరాజు, వార శ్రీధర్‌, కటారి కుమార్‌, కార్యదర్శి యు.సుప్రియ, ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్‌ మల్లేశ్వరి, విద్యార్థులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.