Nov 14,2022 07:18

గజ్వేల్‌ పట్టణం మెన్‌ ఎడ్యుకేషనల్‌ హబ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రజతోత్సవాల సందర్భంగా తెలుగు అధ్యయనశాఖ, రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్షా అభినయాన్‌ (RUSA), తెలంగాణ భాషా, సాంస్కతిక శాఖ సౌజన్యంతో 'బహుజన స్ఫూర్తి ప్రదాతలు' (Bahujan Inspirational Personalities) అనే అంశంపై 17, 18 నవంబర్‌ 2022న రెండు రోజుల పాటు జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. ప్రారంభ సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్‌ డా. ఎ. శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారు. తెలంగాణ కళాశాల విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య డి. రవీందర్‌ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. గౌరవ అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్‌, ఆత్మీయ అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య చింతకింది కాశీం హాజరవుతారు. తెలంగాణ చరిత్ర, సాహిత్య విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్‌ కీలకోపన్యాసం చేస్తారు. పలువురు ప్రముఖులు ఆయా అంశాలపై పత్ర సమర్పణ చేస్తారు.
- డా.వెల్దండి శ్రీధర్‌, సదస్సు సంచాలకులు, 9866977741