హైదరాబాద్ : బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) అధ్యక్షునిగా స్వప్న ప్రాజెక్ట్స్ సిఎండి ఎస్ నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నకైన ఆయన బాధ్యతలను స్వీకరించినట్లు బిఎఐ ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లోని స్వప్న ప్రాజెక్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ దేశ వ్యాప్తంగా మేజర్, మైనర్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఉండటంతో పాటుగా 95 మిలియన్ డాలర్ల పనులను నిర్వహిస్తోంది. నరసింహారెడ్డి ఈ బాధ్యతలను ఆర్ రాధాకష్ణన్ నుంచి స్వీకరించారు.










