కాలే కొలిమిలో కార్ఖానాల్లో
కాలే కడుపుతో కండలు కరిగించి
ఉత్పత్తులు సృష్టించే కర్షక జీవులు
బానిస బతుకులు పోవాలని
శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలని
కార్మిక హక్కుల కోసం
ఎనిమిది గంటల పని దినం కోసం
గొంతెత్తి నిడదించిన రోజు ..
శ్రమ దోపిడీపై
పెట్టుబడిదారీ వ్యవస్థపై
ఎర్రటి నెత్తురు చిందించి
శ్రామిక జెండాను సృష్టించిన రోజు
ఎర్రజెండా పోరు బాట ద్వారా
వ్యవస్థ మారుతుందని
హక్కులు దక్కుతాయని
చాటిన రోజు.. నాడే మేడేనోయ్ !
- ఎస్.కె.బాజీ సైదా
8897282981










