Oct 02,2023 09:58

ప్రత్తిపాడు (గుంటూరు) : గుంటూరులోని ప్రజా సంఘాల నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. సోమవారం తెల్లవారుజాము నుండే పలువురు ప్రజా సంఘాల నేతల ఇండ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్‌ఐఏ బృందం హైదరాబాద్‌ నుండి తనిఖీలకు వచ్చినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ... సాధారణ తనిఖీలు అని స్థానిక పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో ప్రజా సంఘాల నాయకుడు తమల పాకుల సుబ్బారావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని నవులూరు మక్కేవారిపేట వద్ద ప్రజా సంఘాల నేత పచ్చల కిరణ్‌, సిప్పొర ల నివాసంలో ఎన్‌ఐఎ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి టిప్పర్ల బజార్‌ నూర్‌ బాషా నివాసంలో, చినకాకని బ్రామాయ్య నివాసంలో ఎన్‌ఐఎ సోదాలు కొనసాగుతున్నాయి. తాడేపల్లి డోలాస్‌ నగర్‌ లో క్రాంతి కుమార్‌ నివాసం లో మహానాడు 13 వ రోడ్డులో బత్తుల రమణయ్య నివాసంలో ఎన్‌ఐఎ సోదాలు చేపట్టింది. సోదాలతోపాటు మావోయిస్టు కార్యకలాపాలు, తదితర అంశాలపై విచారణ చేస్తున్నారు.

మంగళగిరి రూరల్‌ (గుంటూరు) : గుంటూరు:మంగళగిరి-తాడేపల్లి నగర కార్పొరేషన్‌ పరిధిలో ఎన్‌ఐఎ పోలీసులు రహస్య సోదాలు కొనసాగుతున్నాయి.

మంగళగిరి పరిధి నవులూరు మక్కేవారి పేట లో పచ్చల సిప్పోరా ఇంటిలో సోదాలు.

తాడేపల్లి మహానాడు 13 వ రోడ్డు బత్తుల రమణయ్య నివాసం లోను ఎన్‌ ఐ ఎ సోదాలు.

తాడేపల్లి డోలాస్‌ నగర్‌ లో ఎన్‌ క్రాంతి కుమార్‌ నివాసం లోను ఎన్‌ ఐ ఎ సోదాలు.

మంగళగిరి టిప్పర్ల బజార్‌ నూర్‌ బాషా నివాసంలోను, చినకాకానిలో బ్రహ్మయ్య నివాసంలోను కొనసాగుతున్న ఎన్‌ ఐ ఎ సోదాలు.

చైతన్య మహిళా సంఘం సభ్యురాలు సిప్పోరా కి హైదరాబాద్‌ డిప్యూటీ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎన్‌ఐఎ పేరిట సెప్టెంబర్‌ 13 నోటీసు జారీ.

సిఆర్‌పిసి 160 సెక్షన్‌ క్రింద సిప్పోరాకి ఎన్‌ఐఎ నోటీసు.

తెల్లవారుజామున 5గంటలు నుండి కొనసాగుతున్న ఎన్‌ఐఎ నిర్బంధ సోదాలు.

ఎంటిఎంసి పరిధిలో జరుగుతున్న ఎన్‌ఐఎ సోదాల్లో పెద్ద సంఖ్యలో పాల్గన్న ఎన్‌ఐఎ సిబ్బంది.