Jul 12,2023 20:34
  • కాలపరిమితి కూడా లేదంటూ మండిపడ్డ జెలెన్‌స్కీ
  • రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపైనే ప్రధానంగా నాటో సదస్సులో చర్చ

విలిుయస్‌ : లిథుయేనియా రాజధానిలో మంగళవారం ప్రారంభమైన నాటో సదస్సులో రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపైనే ప్రధానంగా చర్చ సాగింది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ మిలటరీ చర్యలకు ఆజ్యం పోయడంపైనే పశ్చిమ దేశాలు దృష్టి సారించాయి. నాటోలో ఉక్రెయిన్‌ సభ్యత్వానికి నిర్దిష్టమైన గడువును విధించడంలో మంగళవారం నాటో నేతలు విఫలమయ్యారు. కానీ ఉక్రెయిన్‌కు ఆర్థిక, సైనిక మద్దతును కొనసాగించడంపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే నాటోతో ఉక్రెయిన్‌ సంబంధాలు, యుద్ధం ముగిసిన తర్వాత ఇచ్చే భద్రతాపరమైన హామీలు తదితరాలపై కూడా నేతలు చర్చిస్తునాురు.
నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ ఇక్కడ ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, నాటోకు ఉక్రెయిన్‌ను మరింత దగ్గరగా తీసుకురావడానికి మూడు అంశాల ప్యాకేజీపై మిత్రపక్షాలు అంగీకారానికి వచ్చాయనిచెప్పారు. అయితే, 'మిత్రపక్షాలు అంగీకరించి, షరతులనీు నెరవేరిననపుడు'' నాటోలో చేరాల్సిందిగా ఉక్రెయిన్‌కు ఆహ్వానం అందచేస్తామని ఆయన వివరణ ఇచ్చారు. ఇదిలావుండగా, ''నాటోలోకి ఆహ్వానించడానికి లేదాఉక్రెయిన్‌ సభ్యత్వానికి దేనికీ కాలపరిమితి నిర్ధారించకపోవడం అనూహ్యమైనది, అసంబద్ధమైనది'' అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ట్వీట్‌ చేశారు. అదే సమయంలో ఉక్రెయిన్‌ను ఆహ్వానించడానికి కూడా షరతులు అనే ఒక పదాన్ని అస్పష్టంగా చేర్చారని ఆయన విమర్శించారు. నాటో-ఉక్రెయిన్‌ కౌన్సిల్‌ ప్రారంభ సమావేశానికి జెలెన్‌స్కీ బుధవారం హాజరయ్యారు.
నాటోకి ఉక్రెయిన్‌ను మరింత దగ్గరగా ఎలా తీసుకురావాలనే విషయమై నాటో సభ్య దేశాలు చీలిపోయాయి. ఉక్రెయిన్‌ ఎప్పుడు చేరుతుందో స్పష్టమైన హామీ ఇవ్వాలనికొనిు తూర్పు ఐరోపా దేశాలు కోరుతుండగా, అమెరికా, జర్మనీ మాత్రం వివరణ ఇవ్వడానికి విముఖత చూపుతునాుయి.
ప్రచ్ఛను యుద్ధం ముగిసిన తర్వాత నుండి అత్యంత సమగ్ర రీతిలో రక్షణ ప్రణాళికలను నాటో నేతలు ఆమోదించారని స్టోలెన్‌బర్గ్‌ తెలిపారు. కొత్త రక్షణ కార్యాచరణ ప్రణాళికను కూడా ఆమోదించారు. ఈ కొత్త ప్రణాళికల కింద ఏటా రక్షణ రంగంలో తమ స్థూల జాతీయోత్పత్తిలో కనీసం 2శాతానిు పెట్టుబడిగా పెట్టేందుకు నాటో మిత్రపక్షాలు ఆమోదం తెలిపాయి. సైనికీకరణపై ఇలా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్ల సభ్య దేశాల మధ్య ఆయుధ పోటీ పెరుగుతుందని విమర్శకులు వ్యాఖ్యానిస్తునాుర. సామాజిక, ఆర్థికాభివృద్ధి రంగాల నుండి వనరులను మళ్లించడానికి దారితీస్తాయనాురు. ప్రజల జీవిత నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంటునాురు.