న్యూఢిల్లీ : ఇాకామర్స్ సంస్థ మింత్రా అక్టోబర్ 7 నుంచి బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. నాల్గవ ఎడిషన్‌లో 6000 కన్నా ఎక్కువ బ్రాండ్‌లు 23 లక్షలకు పైగా ఉత్పత్తుల ఎంపికను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ దఫా పండగ కార్నివాల్ సమయంలో 80 లక్షల వినియోగదారులు కొనుగోళ్లు చేస్తారని అంచనా వేసింది. మెట్రోయేతర నగరాలలోని వినియోగదారుల కోసం పలు కీలక బ్రాండ్‌ల నుంచి 5 లక్షలకు పైగా కొత్త ఉత్పత్తులను జోడించినట్లు పేర్కొంది.