May 17,2023 11:42

హాయ్ నేస్తాలు! నా పేరు కార్తీక. ఈ సంవత్సరం ఎనిమిదో తరగతి పూర్తి చేశాను. చాలా త్వరగా పూర్తి అయ్యింది. అసలు జరిగినట్టే లేదు. 'తొమ్మిదవ తరగతిలోకి అడుగుపెట్టబోతున్నా' అంటేనే చాలా ఆనందంగా ఉంది. మరో పక్క భయంగానూ ఉంది. ముందుగా పాఠాలు చదువుకుందామా అంటే సిలబస్‌ మొత్తం మారిపోతుందని టీచర్లు చెప్పారు. కొత్త పుస్తకాలు వస్తాయి. అందుకే చదవడం లేదు. కాని లెక్కలు మాత్రం చెప్పించుకుంటున్నా. మా ఇంటి పక్కన సీనియర్స్‌ ఉన్నారు. వాళ్ల బుక్స్‌ తెచ్చుకుని చదువుతా. నాకు ఎంతో ఇష్టమైన మా అమ్మమ్మ గారి ఊరు వెళ్తా. కొన్ని రోజులు ఎంజారు చేసి వస్తా. మా నాన్నగారు కంప్యూటర్‌ క్లాసుకు వెళ్లు అని చెప్పారు. జాయిన్‌ అవుతా. ఏమి వేసవి సెలవులు ఏమో కానీ పాఠశాల ఉంటే బాగుండూ అనిపిస్తుంది. ఫ్రెండ్స్‌తో కలిసి మాట్లాడుకోవచ్చు, ఆడుకోవచ్చు. కాని స్కూలు ఉన్నప్పుడు..'ఎప్పుడు సెలవులు ఇస్తారా!' అని ఎదురుచూసేదాన్ని. దానికి తోడుగా ఈ ఎండలు మామూలుగా లేవు. బయటకు వెళ్లడానికి లేకుండా కాస్తున్నాయి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అవసరానికే బయటకు వెళ్ళండే. మీరు కూడా సెలవుల్లో ఏం చేయబోతున్నారు ఈ పేజీలో అందరితో పంచుకోండి.
 

- సిహెచ్‌ కార్తీక,
8వ తరగతి,
అరవింద మోడల్‌ స్కూలు, మంగళగిరి,
గుంటూరు జిల్లా.