Oct 17,2023 15:19

ముంబయి : ముంబయిలోని గాలి నాణ్యత స్థాయిలు పడిపోతున్నాయి. గత వారం ప్రారంభంలో గాలి నాణ్యత స్థాయిలు 'గుడ్‌ కేటగిరి'లో రికార్డయింది. అయితే ఒకవారం పాటు సగటున రోజువారీ ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడంతో ముంబై నగరంలో గాలి నాణ్యతస్థాయిలు పడిపోయాయి. అయితే అక్కడ తీవ్రం కాని స్థాయిలో మోడరేట్ కేటగిరిలో గాలి నాణ్యత రికార్డయింది.
కాగా, 101 నుంచి 200 మధ్యలో గాలి నాణ్యత ఉంటే.. మోడరేట్‌ కేటగిరిగా రికార్డు అవుతుంది. అయితే 200 దాటితే గాలి నాణ్యతాస్థాయిలు పడిపోయినట్లు లెక్క.