Oct 01,2023 15:39

ఇస్లామాబాద్‌ :  26/11 ముంబయి ఉగ్ర దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ అనుచరుడు కాల్పుల్లో మరణించాడు. పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కర్‌-ఇ-తొయిబా (ఎల్‌ఇటి) మోస్ట్‌ వాంటెడ్‌ లీడర్‌లలో ఒకడైన ముఫ్తీ ఖైజర్‌ ఫరూఖ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కరాచీలో కాల్చిచంపినట్లు పాకిస్తాన్‌ మీడియా తెలిపింది. శనివారం సమనాబాద్‌ ప్రాంతంలోని ఒక మతపరమైన సంస్థ సమీపంలో ఖైజర్‌ ఫరూఖ్‌  లక్ష్యంగా కాల్పులు జరిగినట్లు పోలీస్‌ వర్గాలు, మీడియా తెలిపాయి. తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఖైజర్‌ ఫరూఖ్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు వెల్లడించాయి. ఖైజర్‌ ఫరూఖ్‌ పై కాల్పుల ఘటన ఆ ప్రాంతంలోని సిసిటివిలో రికార్డైన ఫరూఖ్‌ కాల్పుల ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఖైజర్‌ ఫరూక్‌ ఎల్‌ఇటి వ్యవస్థాపకుల్లో ఒకరు మరియు 26/11 ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కి సన్నిహితుడు. ఇటీవల హఫీస్‌ సయీజ్‌ కుమారుడు కమాలుద్దీన్‌ సయీద్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసిన సంగతి తెలిసిందే.