బట్టలు కట్టిన దేశం విలువెంత?
బట్టలు లేని దేహపు విలువెంత?
అసలు దేహపు విలువెంత?
దేహాలను నగంగా నడిపించే దేశపు విలువెంత ?
ఏమో, ఎవడికెరుక ?
మన దేశంలో రోజుకో రాచపుండు కనుక !
దేహం దేశం చుట్టూ
దేశం దేహం చుట్టూ కాలుతున్న
ఈ మణిపూర్ మంటల్లో
బూడిదయ్యేది మాత్రం సామాన్యులే!
కలత చెందింది మాత్రం భారతీయులే ...
స్త్రీలపై జరిగిన ఈ దాడిలో
బూడిదయ్యంది మానవత్వమే కదా...
దేశపు రక్షణ దేహపు రక్షణ
దుర్మార్గపు మతోన్మాద దాడి భక్షణవుతుంటే...
ప్రధాని స్పందన ఖరీదు 36 సెకండ్లు...
నిజమే మనది ఎంత గొప్ప దేశమో ...
సమస్యను సనాతనం మీదికి రుద్దే
కసాయి మూకలకు ఓ నమస్కారం !
జరిగిన ఘోరానికి
కదిలే మనసున్న ప్రతి మనసు శిక్షకు గురైనది
భరతమాత నీకు బట్టలున్నాయా ...
రాకూడని సందేహం నాకు వచ్చినందుకు
తల్లీ, నన్ను క్షమించు...!
- అభిరామ్
97041 53642










