Mar 06,2023 08:04

మతం యొక్క మండపాలు
చిన్నచిన్న ముక్కలై నేలపాలు కానివ్వండి
దేవాలయాల, మసీదుల, గురుద్వారాల, చర్చిల
ఇటుకలు అంధాగ్నిలో కాలనివ్వండి
ఆ విధ్వంసక కుప్పల మీద
మనోహరమైన పూలతోటలు పెరగనివ్వండి
వాటి పరిమళాన్ని వ్యాప్తిజేయనివ్వండి.
పిల్లల పాఠశాలలు, అధ్యయన శాలలు
పెరగనివ్వండి.

మానవాళి సంక్షేమం కోసం
ఇప్పుడు ప్రార్థనా మందిరాలను
ఆసుపత్రులుగా, అనాధ శరణాలయాలుగా,
విశ్వవిద్యాలయాలుగా మార్చనివ్వండి.
ఇప్పుడు ప్రార్థనా మందిరాలను
కళా నిలయాలుగా, లలిత కళా కేంద్రాలుగా,
శాస్త్రీయ పరిశోధనా సంస్థలుగా మారనివ్వండి.
ప్రకాశవంతమైన తెల్లవారుజామున
ప్రార్థనా మందిరాలను
బంగారు వరి పొలాలుగా, ఆరుబయళ్ళుగా,
నదులుగా, అవిశ్రాంత సముద్రాలుగా..
మలచనివ్వండి.

ఇకనుంచి మతానికి మరో పేరు
మానవత్వం !
 

మూలం : తస్లీమా నస్రీన్‌
అనువాదం : పి.శ్రీనివాస్‌ గౌడ్‌
99494 29449