Aug 03,2023 21:23

న్యూఢిల్లీ : భారత రేటింగ్‌ను మెరుగుపర్చినట్లు మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల రేటింగ్‌లలో ఈ సంస్థ పలు కీలక మార్పులు చేసింది. భారత్‌ రేటింగ్‌ను మరింత మెరుగుపర్చి 'ఓవర్‌వెయిట్‌'గా నిర్ణయించినట్లు తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణల అజెండా మూలధన వ్యయాలు, లాభాల విషయంలో సానుకూల దృక్పథంలో ఉన్నాయని పేర్కొంది. చైనా రేటింగ్‌ను 'ఈక్వల్‌ వెయిట్‌'కు తగ్గించింది. చైనా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో అక్కడి మార్కెట్లు ఊపందుకున్నాయని తెలిపింది. అందువల్ల మదుపర్లు అప్రమత్తంగా ఉండి.. లాభాల స్వీకరణకు మొగ్గుచూపాలని పేర్కొంది.