May 04,2023 21:30

ప్రజాశక్తి - బిజినెస్‌ బ్యూరో :మురుగప్ప గ్రూపులో భాగమైన మోంట్రా ఎలక్ట్రిక్‌ సూపర్‌ ఆటో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మార్కెట్లోకి తన తిచక్ర వాహనాలను విడుదల చేసినట్లు ప్రకటించింది. సింగిల్‌ చార్జింగ్‌తో 197 కిలోమీటర్ల మేర ప్రయాణించే ఇవి ఆటోలను విజయవాడ, అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లో టెస్ట్‌ రైడ్‌ల కోసం అందుబాటులోకి తెచ్చామని ఆ కంపెనీ ఎండి కెకె పాల్‌ తెలిపారు. సబ్సీడీ తర్వాత ఎక్స్‌షోరూం వద్ద వీటి ధరలను రూ.3.02 లక్షల నుంచి రూ.3.45 లక్షలుగా నిర్ణయించామన్నారు. ఇవి గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవన్నారు. తెలంగాణలోనూ ఖమ్మం, మంచిర్యాలలో అందుబాటులో ఉంటాయని ఆ కంపెనీ తెలిపింది.