వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. బయట ఫుడ్ కన్నా ఇంట్లో చేసుకునే ఆహారానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే నూనెతో చేసిన పదార్థాల కన్నా మొక్కజొన్న పొత్తు చాలా బెటర్. ఈ సమయంలో మొక్కజొన్న విరివిగా, అతి చౌకగా లభించే ఆహారం. దీని గింజలను పచ్చిగా కాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తినొచ్చు. ఇది చాలా బలమైన ఆహారపదార్ధం. ఇవి ఈ సీజన్‌లో తినడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
- మొక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. పీచు పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉంటే అది మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ అరికడుతుంది
- ఎముకల బలానికి అవసరమైన లవణాలు, మినరల్స్ మొక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి. పసుపు రంగులో ఉండే ఈ చిన్న గింజలలో మినరల్స్ అధికంగా ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా వీటిలో ఉండి ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచటంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.
- మ్నెక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. మ్నెక్కజొన్న గింజల నూనెను చర్మానికి రాస్తే దీనిలో ఉండే లినోలె యాసిడ్ చర్మ మంటలను, ర్యాష్‌లను తగ్గిస్తుంది.
- మొక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన అది రక్తహీనతను తగ్గిస్తుంది. మొక్కజొన్నను ప్రతిరోజు తినడం వల్ల జుట్టు మొదళ్లుకు బలాన్ని చేకూరుస్తుంది. దాంతో జుట్టురాలిపోదు. ఇందులో ఉండే విటమిన్ సి పవర్‌పుల్ యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ వల్ల జట్టు మెత్తగా, మృదువుగా మారుతుంది.










