
అమరావతి : సిఎంఒ లో డిజిటల్ సంతకాల దుర్వినియోగం కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ సిఐడి ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తెలిపారు. శనివారం ఎస్పీ మాట్లాడుతూ .... కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేశారనీ, 'సీఎం పిటిషన్'లు జారీ చేశారనీ తెలిపారు. ఒక్కో ఫైల్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారని చెప్పారు. ఏప్రిల్ నుంచి 3 నెలలలో 66 సీఎంపీలు జారీ చేసిన నిందితులు.. మొత్తం రూ.15 లక్షల వరకూ వసూలు చేశారనీ, అయితే, ఏ దస్త్రానికి కూడా తుది ఆమోదం రాలేదని తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ చేపట్టామని వివరించారు.