వాషింగ్టన్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపినాథ్‌తో భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న సీతారామన్ ప్రపంచ బ్యాంకు వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఈ భేటీలో రుణ సమస్యలు, క్రిప్టో కరెన్సీ, ప్రపంచ ఆర్థిక పరిణామాలు తదితర అంశాలపై చర్చించారు. సీతారామన్‌తో మంచి చర్చలు జరిగాయని, జి20కి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్ రుణ సమస్యలు, క్రిప్టో సవాళ్లపై పురోగతి సాధిస్తుందని గీతా గోపినాథ్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌లో కీలక హోదాలో నియమితులైన గీతాను మంత్రి ప్రశంసించారు.










